Type Here to Get Search Results !

అనారోగ్యంతో యువతి మృతి.. బాధిత కుటుంబానికి మంత్రి పొంగులేటి ఆదేశాలతో రూ.10 వేల ఆర్థిక సాయం

NAMASTHE NEWS 0

అనారోగ్యంతో యువతి మృతి.

బాధిత కుటుంబానికి మంత్రి పొంగులేటి ఆదేశాలతో రూ.10 వేల ఆర్థిక సాయం.




తిరుమలాయపాలెం, జూలై 30 (నమస్తే న్యూస్ )

కటిక పేదరికం, దానికి తోడు సుదీర్ఘకాలంగా వేధించిన అనారోగ్యం ఓ నిరుపేద కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. తిరుమలాయపాలెం మండల పరిధిలోని ఎర్రగడ్డ గ్రామానికి చెందిన రెబ్బనపల్లి నవ్య కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.నవ్య అనారోగ్యానికి చికిత్స చేయించేందుకు కుటుంబ సభ్యులు తమ సర్వస్వాన్ని ఖర్చు చేసినప్పటికీ ఆమెను కాపాడుకోలేకపోయారు. ఇప్పటికే పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ కుటుంబానికి నవ్య మరణం తీరని విషాదాన్ని మిగిల్చింది. కుటుంబం ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితిని చూసి గ్రామస్థులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ఈ విషయం తెలుసుకున్న ఎర్రగడ్డ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లమల్ల ప్రతాప్, బెల్లం శ్రీధర్, అర్తిమల్ల లక్ష్మీనారాయణ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారి పరిస్థితిని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.బాధిత కుటుంబ పరిస్థితిపై వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు నల్లమల్ల ప్రతాప్ బృందం అత్యవసర సహాయంగా రూ.10,000 నగదును కుటుంబ సభ్యులకు అందజేసింది.అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తిరుమలాయపాలెం మండల అధ్యక్షులు కొప్పుల అశోక్, మాజీ జడ్పీటీసీ సభ్యులు బెల్లం శ్రీనివాస్ రెబ్బనపల్లి నవ్య మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడం ద్వారా మానవత్వమే గొప్పదనే సందేశాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి చాటిచెప్పారని స్థానికులు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System