- మంత్రి పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలి
- పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ
- మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ కోప్పుల అశోక్
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, జూలై 28 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం నిర్వహించనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్ పిలుపునిచ్చారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనలో భాగంగా తిమ్మకపేట గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం ఖమ్మం–వరంగల్ ఆర్‌అండ్‌బీ రహదారి నుంచి తెట్టెలపాడు మీదుగా పాపాయిగూడెం వరకు వెళ్లే రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
అలాగే మేడిదేపల్లి గ్రామంలో సర్పంచ్ అనిల్ రెడ్డి తల్లిదండ్రులు మోర రామలింగారెడ్డి, మల్లమ్మ జ్ఞాపకార్థం నిర్మించిన టీజీ ఆర్‌ఎస్‌టీసీ బస్ షెల్టర్‌ను ప్రారంభించనున్నారు.** అనంతరం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, పొలేరమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. తదుపరి జూపెడ గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్ కోరారు.


