Type Here to Get Search Results !

జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మందడి ఇజ్రాయెల్‌కు శుభాకాంక్షలు

NAMASTHE NEWS 0

  • జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మందడి ఇజ్రాయెల్‌కు శుభాకాంక్షలు
  • సోమయ్య దంపతుల ఆశీర్వాదం తీసుకున్న నూతన ఖమ్మం జిల్లా జేఏసీ అధ్యక్షుడు



రిపోర్టర్ :దామల్ల భాస్కర్

తిరుమలాయపాలెం, జూలై 28 (నమస్తే న్యూస్ )

తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లా జేఏసీ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన సుబ్లేడు గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు మందడి ఇజ్రాయెల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రతాపని సోమయ్య సరోజనమ్మ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా సోమయ్య దంపతులు ఇజ్రాయెల్‌కు శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ, ఇజ్రాయెల్ జీవితంలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి ప్రజాసేవలో మరింత గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గండమల్ల ఐషయ్య, మాజీ ఎస్‌ఎంసీ చైర్మన్ తాళ్ల మల్లయ్య, భూక్య వెంకన్న, గండమల్ల దేవయ్య, మెట్టు మధు, ప్రతాపని సరోజనమ్మతో పాటు జేఏసీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System