జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే (ఐ.జె.యు) ధ్యేయం.
జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్.
దంతాలవల్లి, జూలై 29 (నమస్తే న్యూస్): జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) నిరంతరం కృషి చేస్తోందని జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్ అన్నారు. దంతాలవల్లి మండల కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్‌లో బుధవారం జిల్లా కార్యవర్గ సభ్యులు వోలాద్రి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.సమాజానికి వాస్తవ సమాచారాన్ని అందించే జర్నలిస్టులకు ప్రభుత్వం సంక్షేమ పరంగా అండగా నిలవాలని ఆయన కోరారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇందిరమ్మ గృహాల పథకంలో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించేలా జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. అలాగే సంక్షేమ పథకాల అమలులో జర్నలిస్టులకు ప్రత్యేక కోటా ఏర్పాటు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, సంబంధిత అధికారులను కోరనున్నట్లు చెప్పారు.జర్నలిస్టుల సంక్షేమ నిధి, ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా, గృహ వసతి, పెన్షన్, అక్రిడిటేషన్ తదితర సమస్యల పరిష్కారానికి సంఘం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రతి వర్కింగ్ జర్నలిస్టు సభ్యత్వం నమోదు చేసుకుని సంఘ బలోపేతానికి సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు దూలం శ్రీనివాస్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గందశిరి రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి గాడివల్లి శ్రీహరి, జిల్లా కోశాధికారి వెంకటరమణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మగాని మధు, జిల్లా సహాయ కార్యదర్శి దావూరి ప్రశాంత్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని అన్నారు.అనంతరం మండలంలోని పలువురు జర్నలిస్టులు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సభ్యత్వాలను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో మండల జర్నలిస్టులు చంద్రభాను, భూపతి కాతయ్య గౌడ్, కారుపోతుల రాములు గౌడ్, ఓలాద్రి వెంకట్ రెడ్డి, వడిదం నరేందర్, కొండా తెంకన్న, భూపాల్ యాదవ్, సురేందర్, శ్రీనివాస్, బిక్షపతి, రవి తదితరులు పాల్గొన్నారు.
















