బీరిశెట్టిగూడెం గ్రామానికి ఉచిత స్ప్రే పంపు మంజూరు
దంతాలపల్లి, జూలై 30 (నమస్తే న్యూస్): యూనియన్ బ్యాంక్ సీఎస్ఆర్ నిధుల సహకారంతో, జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ సభ్యుడు శ్రీ హుస్సేన్ నాయక్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు ఉచితంగా స్ప్రే పంపులను పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో భాగంగా బీరిశెట్టిగూడెం గ్రామ పంచాయతీకి ఒక స్ప్రే పంపు మంజూరైంది.ఈ స్ప్రే పంపును దంతాలపల్లి మండల బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు సూరబోయిన లింగస్వామి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ జెట్టి ఆజాద్ చంద్రశేఖర్‌కు అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా గ్రామానికి స్ప్రే పంపు మంజూరు చేయడంలో సహకరించిన యూనియన్ బ్యాంక్ సీఎస్ఆర్ యాజమాన్యానికి, జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ సభ్యుడు శ్రీ హుస్సేన్ నాయక్‌కు ఉప సర్పంచ్ జెట్టి ఆజాద్ చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ బూత్ అధ్యక్షులు సూరబోయిన జలంధర్, డోనికేని ఉమేష్, గండి విజయ్, లింగాల రాజుతో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

