Type Here to Get Search Results !

బచ్చోడు గ్రామంలో వనభోజనాల సందడి

NAMASTHE NEWS 0

  • బచ్చోడు గ్రామంలో వనభోజనాల సందడి
  • హస్నాబాద్ గుట్టపై వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న గ్రామస్తులు


రిపోర్టర్: దామల్ల భాస్కర్

తిరుమలాయపాలెం, జూలై 28 (నమస్తే న్యూస్ ) 

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో మంగళవారం వనభోజనాల సందడి నెలకొంది. పురాతన కాలం నుంచి కొలవబడుతున్న హస్నాబాద్ గుట్టపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి గ్రామంలోని ఆడపడుచులు, చిన్నారులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వంట సామాగ్రి, భోజన పదార్థాలతో నిండిన బుట్టలను తలపై పెట్టుకుని భక్తి శ్రద్ధలతో గుట్టపైకి చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రకృతి ఒడిలో కూర్చుని వనభోజనాలు చేశారు. చిన్నారులు ఆటపాటలతో సందడి చేయగా, పెద్దలు కథలు చెప్పుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా వనభోజనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. స్వామి వారి దర్శనంతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడానికి ఇది మంచి అవకాశమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండలు, సుజాత, రామకృష్ణ, నిరోష, రాజు, సత్యవతి, రాము, మల్లిక, సతీష్, ఉష, అంజి, ఉమ, సుధాకర్, కళమ్మ, రామచంద్రు, వెంకన్న, విజయ్, సుభాస్కరణ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System