Type Here to Get Search Results !

మరిపెడలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్.

NAMASTHE NEWS 0

  •  మరిపెడలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్.
    - అమరవీరులకు ఘన నివాళి.
    - దేశం కోసం ప్రాణం ఇచ్చిన వారిని ఎన్నటికీ మరువం
    కార్గిల్ సొసైటీ చైర్మన్  గాదె రాంబాబు. 



కారంపురి వెంకటేశ్వర్లు,నేత.

7893556455.

డోర్నకల్/మరిపెడ/జులై 26(నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని కార్గిల్ సెంటర్‌లో ఆదివారం రోజున కార్గిల్ విజయ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మరిపెడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్(సీఐ) పవన్,మరిపెడ పట్టణ సబ్‌ ఇన్‌స్పెక్టర్(ఎస్‌ఐ) సతీష్ ముఖ్య అతిథులుగా హాజరై కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ,1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చొరబాటుదారులను సమర్థవంతంగా తిప్పికొట్టి భారత సైన్యం జూలై 26న చారిత్రాత్మక విజయాన్ని సాధించింది.దేశ సార్వభౌమత్వాన్ని,భద్రతను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ల సేవలను భారతదేశం ఎన్నటికీ మరువదు.వారి త్యాగమే ఈరోజు మనం స్వేచ్ఛగా బతకడానికి కారణం అని అన్నారు.కార్గిల్ సొసైటీ చైర్మన్ గాదె రాంబాబు మాట్లాడుతూ,కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికుల త్యాగస్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం.దేశభక్తి,క్రమశిక్షణ,సేవాభావంతో ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలి.మనం వారికి ఇచ్చే అసలైన నివాళి అదే అని పిలుపునిచ్చారు.అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి,వై చైర్ పర్సన్ కాలం సునిత రవింధర్ రెడ్డీలు మాట్లాడుతూ,భారత సైన్యం దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.కార్గిల్ విజయం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం.ప్రతి ఇంట్లోనూ ఈ విజయ గాథను పిల్లలకు చెప్పాలన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నూకల అభినవ్ రెడ్డి,రామ్ లాల్,బీజేపీ నాయకులు భూక్యా దేవిక శంకర్ నాయక్,సుధాకర్ నాయక్ పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది,ప్రజాప్రతినిధులు,వివిధ సంఘాల ప్రతినిధులు,యువకులు,విద్యార్థులు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్గిల్ అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు.చివరగా 2 నిమిషాల మౌనం పాటించి అమరజవాన్లకు నివాళులు అర్పించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System