Type Here to Get Search Results !

వివాహితపై హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్.

NAMASTHE NEWS 0

వివాహితపై హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్.



కారంపురి వెంకటేశ్వర్లు నేత.7893556455.

డోర్నకల్/మరిపెడ,జూలై 26(నమస్తే న్యూస్)

మరిపెడ పట్టణంలోని శాంతి థియేటర్ వీధిలో మేకల తండా గ్రామం,తిరుమలాయపాలెం మండలానికి చెందిన ఓ వివాహితపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.పోలీసుల వివరాల ప్రకారం,అబ్బాయిపాలెం గ్రామం,మరిపెడ మండలానికి చెందిన జిన్నా యాకయ్య అలియాస్ మున్నా(25)అనే వ్యక్తి ఇటీవల శాంతి థియేటర్ వీధిలో బాధిత వివాహితపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఘటనపై కేసు నమోదు చేసిన మరిపెడ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో నిందితుడు జిన్నా యాకయ్య అలియాస్ మున్నాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.అనంతరం చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా,కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని,నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System