Type Here to Get Search Results !

విద్యార్థులకు నాణ్యమైన విద్య,పోషకాహారం అందించాలి:జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.

NAMASTHE NEWS 0

ఎస్ఐఆర్ సవరణ ప్రక్రియ ఇంటింటి సర్వేను ఆగస్టు 3 లోపు పూర్తి చేయాలి.
సంక్షేమ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ.
విద్యార్థులకు నాణ్యమైన విద్య,పోషకాహారం అందించాలి.
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.





డోర్నకల్/మరిపెడ(జూలై 25)నమస్తే న్యూస్. 

శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా పర్యటించారు.మండల కేంద్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.గణన ఫారాలను పంపిణీ చేసి తిరిగి బిఎల్ఓల నుండి వాటి వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు.క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి డిజిటలైజేషన్ చేయాలని సూచించారు.ప్రతి ఇంటికి వెళ్లి వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు.అందుకోసం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు,బిఎల్ఓలు,పర్యవేక్షకులు,అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని చెప్పారు.ఆగస్టు 3 లోపు ఫారాలు సమర్పించాలని ఆదేశించారు.అనంతరం మండల కేంద్రంలోని నరసింహులపేట సాంఘిక సంక్షేమ శాఖ బాలికల పాఠశాల,వసతి గృహాన్ని తనిఖీ చేశారు. పిల్లలతో ఆత్మీయంగా మాట్లాడారు.తరగతిగదులు,వంటగది,భోజనశాల,మరుగుదొడ్లు,పరిసరాలను పరిశీలించారు.విద్యార్థులతో స్వయంగా మాట్లాడి అందుతున్న విద్యా సౌకర్యాలు,ఆహార మెనూ గురించి ఆరా తీశారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఆహార మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి సబ్జెక్టుపై అవగాహన వచ్చేలా బోధన చేయాలని,ఆంగ్ల పరిజ్ఞానం కూడా విద్యార్థులకు అందించాలని సూచించారు. ఉపాధ్యాయుల హాజరు శాతం ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారంపై విద్యార్థులకు అవగాహన ఉండేలా చూడాలని తెలిపారు. పిల్లలకు భోజనం సిద్ధం చేసే సిబ్బందికి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. బాలికల ఆరోగ్యం,మానసిక స్థితిగతులను నిరంతరం గమనిస్తూ ఉండాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System