Type Here to Get Search Results !

రాజకీయాల్లో యువతే దేశానికి భవిష్యత్తు:డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ్డు మధు

NAMASTHE NEWS 0

రాజకీయాల్లో యువతే దేశానికి భవిష్యత్తు: డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ్డు మధు.
ప్రజాసమస్యల పరిష్కారానికి యువకులు ముందుండాలి.
తిరుమలాయపాలెం సీపీఐఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను.




రిపోర్టర్:దామల్ల భాస్కర్

తిరుమలయపాలెం,జూలై 26( నమస్తే న్యూస్)

తిరుమలాయపాలెం మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామంలో ఆదివారం,సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో యువజన సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువత, సీపీఎం, డీవైఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. దేశ రాజకీయాలు, ప్రజా ఉద్యమాలు, సామాజిక సేవ, యువత బాధ్యత, ప్రజా సమస్యల పరిష్కారంలో యువత పోషించాల్సిన పాత్రపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి కొమ్ము శీను మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువత రాజకీయాలకు దూరంగా కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండాలని పిలుపునిచ్చారు. నేటి యువత విద్య, ఉపాధి, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన పెంచుకుని ప్రజల పక్షాన పోరాడే నాయకత్వాన్ని అందించాలని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడే వారే నిజమైన రాజకీయ నాయకులని, అధికారం కోసం కాదు  ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి రావాలని యువతకు సూచించారు.

మండల ప్రజల సమస్యల పరిష్కారంలో సీపీఎం పార్టీ ఎప్పుడూ ముందు వరుసలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు కోసం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శాఖను సాధించడంలో, ప్రజల అవసరాల కోసం పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంలో సీపీఎం పార్టీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ప్రజలకు అవసరమైన ప్రతి అంశంపై ఉద్యమాలు నిర్వహించి, అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి అనేక సమస్యలకు పరిష్కారం సాధించామని తెలిపారు. ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే పార్టీగా సీపీఎం తన బాధ్యతను నిరంతరం నిర్వర్తిస్తోందన్నారు.

పిండి గ్రామం చరిత్రాత్మకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పోరాటగడ్డగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు. రైతులు, కూలీలు, పేదల హక్కుల కోసం జరిగిన ఉద్యమాలకు ఈ ప్రాంతం స్ఫూర్తిగా నిలిచిందని, అదే పోరాట స్ఫూర్తిని నేటి యువత కొనసాగించాలని పిలుపునిచ్చారు. నేటి తరం యువత కూడా అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రజల హక్కుల సాధన కోసం ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.

డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బొడ్డు మధు మాట్లాడుతూ యువతను చైతన్యవంతం చేయడంలో డీవైఎఫ్‌ఐ దేశవ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. విద్య, ఉపాధి, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తూనే సమాజ సేవలోనూ డీవైఎఫ్‌ఐ ముందుంటోందన్నారు. రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, మొక్కల నాటడం, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు, పరిశుభ్రత కార్యక్రమాలు, యువతకు అవగాహన సదస్సులు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి డీవైఎఫ్‌ఐ కృషి చేస్తోందని వివరించారు.

దేశాభివృద్ధికి యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారం కోసం ఉద్యమించే యువతే రేపటి నాయకత్వాన్ని అందించగలదని అన్నారు. శాస్త్రీయ దృక్పథం, లౌకిక విలువలు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక సమానత్వం కోసం యువత ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.సమ్మేళనంలో పలువురు యువకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధి, నిరుద్యోగ నిర్మూలన, ప్రభుత్వ విద్య, వైద్య సేవల బలోపేతం కోసం యువత ముందుండాలని అభిప్రాయపడ్డారు. సమాజాభివృద్ధిలో యువత కీలక శక్తిగా ఎదిగి ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించాలని సమావేశం పిలుపునిచ్చింది.ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు తుళ్లూరు నాగేశ్వరరావు పద్మనాభుల సుధాకర్ రావు దాసరి మహేందర్ దిండు మంగపతి సర్పంచ్ కామల్ల సువార్త జాల ఉమేష్ దొండేటి నిర్మల్ రావు రాజేష్ రాథోడ్ చల్ల వెంకటేశ్వర్లు పిట్టల పాపారావు పప్పుల ఉపేందర్ నేరుసుల వెంకటేష్ గుండమల ఉపేందర్ కొమ్ము నాగేశ్వరరావు కామల్లసుని గుడివాడ నవీన్ ఆర్ సుందరయ్య గంట రాము రాములబైల్ రవి కామల్ల చందన్ వంశీ వికాస్ తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System