Type Here to Get Search Results !

గిరిజన ఆశ్రమ పాఠశాలలో పరిశుభ్రత,నాణ్యత ఆకస్మిక తనిఖీ.

NAMASTHE NEWS 0

గిరిజన ఆశ్రమ పాఠశాలలో పరిశుభ్రత,నాణ్యత ఆకస్మిక తనిఖీ.
టీ పీసీసి ఎస్సి సెల్ రాష్ట కార్యదర్శి శేషం కిరణ్.




కారంపురి వెంకటేశ్వర్లు నేత.7893556455.

డోర్నకల్/మరిపెడ,జులై 31(నమస్తే న్యూస్).

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి శేషం కిరణ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు.అన్నం,కూరల నాణ్యత బాగుందని,భోజనం రుచికరంగా ఉందని ప్రశంసించారు.పాఠశాల వార్డెన్ రమేష్‌ను ఈ సందర్భంగా అభినందించారు.అనంతరం పాఠశాలలో అమలవుతున్న మెనూను,విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.పాఠశాల ఆవరణ,మరుగుదొడ్ల పరిశుభ్రతను తనిఖీ చేశారు.బ్లీచింగ్‌తో పాటు పారిశుద్ధ్య చర్యలు సక్రమంగా నిర్వహిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన శేషం కిరణ్,కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని,కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System