Type Here to Get Search Results !

జలసిరి' పనుల్లో వేగం పెంచాలి... క్షేత్రస్థాయిలో డిపిఓ జి. వినోద్ కుమార్ సుడిగాలి పర్యటన!

NAMASTHE NEWS 0

జలసిరి' పనుల్లో వేగం పెంచాలి.
క్షేత్రస్థాయిలో డిపిఓ జి. వినోద్ కుమార్ సుడిగాలి పర్యటన!



రిపోర్టర్: దామల్ల భాస్కర్

తిరుమలాయపాలెం,జూలై 31 (నమస్తే న్యూస్ )


అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, మరియు ప్రజలు త్రికరణ శుద్ధిగా చేతులు కలిపినప్పుడే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని ఖమ్మం జిల్లా పంచాయతీ అధికారి (DPO), తిరుమలాయపాలెం మండల ప్రత్యేక అధికారి జి. వినోద్ కుమార్ స్పష్టం చేశారు. మండల పరిధిలోని పిండిప్రోలు, బీరోలు, ఏలు వారి గూడెం గ్రామాలలో శనివారం ఆయన మెరుపు పర్యటన చేశారు. 'జలసిరి' ప్రోగ్రాంలో భాగంగా సాగుతున్న జల సంరక్షణ పనులను క్షేత్రస్థాయికి వెళ్లి స్వయంగా పరిశీలించారు.


సమన్వయంతోనే పల్లె ప్రగతి: నాణ్యత ముఖ్యం


ఈ సందర్భంగా డిపిఓ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు జలసిరి పనులు ఎంతో కీలకమన్నారు. ఈ బృహత్తర కార్యం విజయవంతం కావాలంటే కేవలం అధికారుల ఆదేశాలే సరిపోవని, క్షేత్రస్థాయి ఉద్యోగుల పర్యవేక్షణ, స్థానిక ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పిండిప్రోలు, బీరోలు, ఏలువారి గూడెం గ్రామాల్లో పనుల ప్రగతిని సమీక్షిస్తూ.. ఎక్కడా నాణ్యత లోపించకుండా, నిబంధనల ప్రకారం నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందిని ఆదేశించారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు!

ప్రభుత్వ ఆశయాలకు గండికొడుతూ విధుల్లో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని డిపిఓ హెచ్చరించారు. అధికారులు, ఉద్యోగులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారిని చైతన్యపరుస్తూ పనులను వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System