Type Here to Get Search Results !

మూడు నెలలుగా వేతనాలు బకాయి.. నల్ల బ్యాడ్జీలతో నిరసన.

NAMASTHE NEWS 0

 

మూడు నెలలుగా వేతనాలు బకాయి.. నల్ల బ్యాడ్జీలతో నిరసన.





రిపోర్టర్: పిల్లలు నరసింహారావు
సెంటర్: బయ్యారం

బయ్యారం,జూలై 31 (నమస్తే న్యూస్): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో వీ బీజీఆర్ఎంజీ (VBGRMG) పథకాలలో పనిచేస్తున్న సిబ్బందికి గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు.అనంతరం తమ సమస్యలను పరిష్కరించి, పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎంపీడీఓ దీపికకు వినతిపత్రం సమర్పించారు. మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ–సృజన స్వరూప్, సాంకేతిక నిర్వాహకులు కరుణ శేఖర్, రమేష్, హాఫిజ్, శ్రీనివాసరావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System