Type Here to Get Search Results !

గోవింద నామస్మరణతో మారుమోగిన ఇంద్రకీలాద్రి వెంకటేశ్వర స్వామి క్షేత్రం.

NAMASTHE NEWS 0

గోవింద నామస్మరణతో మారుమోగిన ఇంద్రకీలాద్రి వెంకటేశ్వర స్వామి క్షేత్రం.
వైకుంఠ తొలి ఏకాదశి వేడుకల్లో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి వెంకటేశ్వరస్వామి క్షేత్రం
ఐదు వేల మందికి పైగా భక్తుల స్వామివారి దర్శనం.
వైకుంఠ తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజల్లో భక్తుల విశేష భాగస్వామ్యం.
వైభవంగా వైకుంఠ తొలి ఏకాదశి ఉత్సవాలు శ్రీ ఇంద్రకీలాద్రి వెంకటేశ్వరస్వామి క్షేత్రం నికి పోటెత్తిన భక్తజనం.



నర్సింహులపేట, జూలై 25 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కపిలగిరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ తొలి ఏకాదశి సందర్భంగా శనివారం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, నైవేద్యాలు వైభవంగా నిర్వహించారు.తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణలతో మారుమోగగా, భక్తిశ్రద్ధలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. దర్శనం సాఫీగా జరిగేలా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు, తీర్థప్రసాదాల పంపిణీని క్రమబద్ధంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో దర్శన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది.వైకుంఠ తొలి ఏకాదశి సందర్భంగా సుమారు ఐదు వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేయగా, ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సేవలు, పూజా కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System