Type Here to Get Search Results !

విద్యార్థులు గంజాయి వంటి మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.

NAMASTHE NEWS 0

విద్యార్థులు గంజాయి వంటి మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.
గంజాయి నిర్మూలనలో ప్రతి విద్యార్థి పోలీసు శాఖకు సహకరించాలి.
సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా, మంచి పనుల కోసమే వినియోగించాలి.
మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి.



రిపోర్టర్: పిల్లల నరసింహారావు 

సెంటర్:బయ్యారం

బయ్యారం,జూలై 26(నమస్తే న్యూస్)

జిల్లా బయ్యారం మండలంలోని ఇర్సులాపురం ఆశ్రమ పాఠశాలను సందర్శించి డీఎస్పీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎస్పీ  మాట్లాడుతూ విద్యార్థులు గంజాయి వంటి మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, గంజాయి నిర్మూలనలో ప్రతి విద్యార్థి పోలీసు శాఖకు సహకరించాలని సూచించారు. గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా, మంచి పనుల కోసమే వినియోగించాలని సూచించారు. ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేయకుండా, సమయాన్ని వృథా చేసుకోకుండా చదువుపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు.పోక్సో చట్టంపై కూడా అవగాహన కల్పిస్తూ, చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల ఎటువంటి తప్పిదాలు చేయరాదని, విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశయాలను నెరవేర్చేలా ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మొత్తం 200 మంది విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొని డీఎస్పీ గారు ఇచ్చిన సూచనలను ఆసక్తిగా ఆలకించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System