- బయ్యారం మండల రైతుకు "రైతునేస్తం" శత సంచిక కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక సత్కారం.
రిపోర్టర్, పిల్లల నరసింహారావు
సెంటర్, బయ్యారం
బయ్యారం, జూలై 28 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా రైతువేదికలో ఈరోజు నిర్వహించిన "రైతునేస్తం" కార్యక్రమం విజయవంతంగా 100వ సంచిక పూర్తి చేసుకున్న సందర్భంగా బయ్యారం మండలం, గంధంపల్లి గ్రామానికి చెందిన ఆదర్శ ఆయిల్ పామ్ రైతు వాంకుడోత్ వీర్యా జిల్లా వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా సన్మానించి ప్రశంసాపత్రం అందజేసింది.ఆయిల్ పామ్ సాగులో ఆధునిక సాగు విధానాలను అనుసరిస్తూ, ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నందుకు ఈ పురస్కారం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా వ్యవసాయ అధికారి రైతును అభినందిస్తూ, ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయం అందించే పంటలను రైతులు విస్తృతంగా సాగు చేయాలని సూచించారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా రైతులు స్థిరమైన ఆదాయాన్ని పొందడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా బయ్యారం మండల వ్యవసాయ అధికారి శ్రీ వాంకుడోత్ వీర్యా గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మండలంలోని రైతులు కూడా ఆయిల్ పామ్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవాలని కోరారు.

