- కామ్రేడ్ ఈసం వెంకన్నకు (మాజీ సర్పంచ్ )విప్లవ జోహార్లు.
బయ్యారం, జూలై 28 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఇర్సులాపురం గ్రామపంచాయతీ చెందిన సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఉమ్మడి పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ కామ్రేడ్ ఈసం వెంకన్న అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం తుది శ్వాస వదిలారు కామ్రేడ్ వెంకన్న మరణం పట్ల సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ విచారాన్ని వ్యక్తం చేస్తూ కామ్రేడ్ ఈసం వెంకన్న భౌతిక కాయంపై సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు బండారు ఐలయ్య. సిపిఐఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి బిళ్ళ కంటి సూర్యనారాయణ పార్టీ పతాకాన్ని కప్పి విప్లవ జోహార్లు అర్పించారు.వారి కుటుంబానికి బంధుమిత్రులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు. కామ్రేడ్ ఈసా వెంకన్న ఆదివాసి కుటుంబంలో జన్మించి పేద రైతుగా జీవిస్తూ కామ్రేడ్ దొరన్న నాయకత్వంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలో సభ్యుడిగా చేరి అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొని క్రియాశీలక పాత్ర పోషించాడు.ఈ క్రమంలోనే గ్రామ పంచాయతీకి పార్టీ తరఫున సర్పంచ్ గాఎన్నికై నిజాయితీగా.నిస్వార్ధంగా గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశాడు.తాను నమ్మిన రాజకీయ లక్ష్యం కొరకు అనారోగ్యానికి గురయ్యేంతవరకు పార్టీ నిర్వహి స్తున్న ప్రజా ఉద్యమాలలో ఆదివాసుల హక్కుల కోసం జరిగే పోరాటాలలో చురుకైన పాత్ర పోషించాడనీ వారన్నారు. ఈ సంతాప కార్యక్రమంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులు గండెల పునేష్. కత్తి అశోక్. పడిశాల ముత్తయ్య. కత్తి రమేష్. బానోతు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

