గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో త్రాగునీటి డిస్పెన్సర్.
తిరుమలాయపాలెం,జూలై 29 (నమస్తే న్యూస్ )
బీరోలు గ్రామ శ్రేయస్సు కోసం, సిబ్బంది సంక్షేమం కోసం మన పంచాయతీ కార్యదర్శి మౌనిక ప్రత్యేక చొరవ తీసుకొని, సర్పంచ్ గుమ్మడి దేవ బిక్షం ఉప సర్పంచ్ మంగమ్మ మరియు జి.పి.ఓ. రమేష్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో తాగునీటి డిస్పెన్సర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.మన పంచాయతీ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, సిబ్బంది అందరూ ఈ డిస్పెన్సర్ నుండి ఉచితంగా తాగునీటిని పట్టుకోవచ్చని గ్రామపంచాయతీ కార్యదర్శిమౌనిక ప్రత్యేకంగా ఆదేశించారు.ఈ కార్యక్రమంలో భాగస్వాములైన గ్రామపెద్దలు కొప్పుల రాంరెడ్డి యస్.కె. జానీబాబా నాగరాజు సమక్షంలో ఈ సదుపాయం ప్రారంభమైంది. సిబ్బంది అందరూ గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు పాలకవర్గ ఆదేశాల ప్రకారం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

