Type Here to Get Search Results !

సమసమాజ స్థాపన కోసం నిరంతరం కృషిచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

NAMASTHE NEWS 0

సమసమాజ స్థాపన కోసం నిరంతరం కృషిచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.


తిమ్మక్కపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి.


మేడిదపల్లి స్టేజిలో బస్సు షెల్టర్ జూపెడలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు  ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి.




తిరుమలాయపాలెం,జూలై 29 (నమస్తే న్యూస్)

సమ సమాజ స్థాపన కోసం నిరంతరం విచ్చేసి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం మండల పర్యటనలో భాగంగా తిమ్మక్కపేటలో రిటైర్ ఎస్ఐ సుంచు కోటయ్య, కర్ష ఉపేందర్, ఆధ్వర్యంలో  గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆయన ముఖ్యఅతిథిగా ఆవిష్కరించారు. అనంతరం పాపాయిగూడెం గ్రామం నుండి తెట్టెలపాడు చెరువు కట్ట గోపాలపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మేడదపల్లి  స్టేజి వద్ద మేడిదపల్లి సర్పంచ్ మోర అనిల్ రెడ్డి ఆయన తండ్రి మోర రామలింగారెడ్డి జ్ఞాపకార్థం బస్ షెల్టర్ ను నిర్మించగా ప్రారంభించారు. అనంతరం  జూపెడ గ్రామంలో వీటి రోడ్డు నిర్మాణం ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు ఆయన హాజరై గృహప్రవేశాలను స్థానిక సర్పంచ్ వనవాస నరేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల కోసం పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం   సంక్షేమం అభివృద్ధి నిరంతరం కొనసాగిస్తూ జోడు ఎడ్లలాగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని అన్నారు. మూడు విడతల్లో రాష్ట్రంలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించి తీరుతామని అన్నారు. రైతులంతా ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ఆరుదడి పంటలు  వేసుకోవాలని ఎల్ నినో  ప్రభావం తో వర్షాలు తక్కువగా పడతాయి అన్న శాస్త్రవేత్తల సూచనలతో రైతులు వరి పంటను తగ్గించి ఆరుదడి పంటలను సాగు చేసుకోవాలని నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రతి రైతు పంట కుంటలను తీసుకోవాలని ప్రతి ఇంట్లో నేటి ఇంకుడు గుంతలు తీసుకోవాలని తద్వారా భూగర్భ జలాలు పెరిగి వచ్చే ఏసవిలో నీటి సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఆర్డీవో శ్రీనివాసరావు, తాహసిల్దార్ లూథర్ విల్సన్, ఎంపీడీవో ఎస్ కే సిలార్ సాహెబ్,గ్రామ సర్పంచ్ రేపాకుల సుభద్ర శివలింగం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గ్రామ సహాయం నరేష్ రెడ్డి పాలేరు నియోజకవర్గం ఆత్మ కమిటీ కన్వీనర్ చావా శివరామకృష్ణ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొప్పుల అశోక్ మాజీ జెడ్పిటిసి బెల్లం శ్రీనివాస్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం రాజశేఖర్   మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నల్లమల్ల ప్రతాప్ నంద్యాల శ్యాంసుందర్ రెడ్డి    రిటైర్డ్ ఎస్ఐ చుంచు కోటయ్య లెక్చరర్   దుబాకుల  వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ లు సండ్ర వెంకటేశ్వర్లు చెంచు రాములు చుంచు వెంకన్న కరిశ ఉపేందర్ పత్తి నాగేశ్వరరావు సర్పంచ్ లు సంఘ బత్తుల స్వాతి సుమన్ రెడ్డి కామల్ల సువార్త ఉప సర్పంచ్  చామకూరి రాజ్ కుమార్ గుమ్మడి దేవ బిక్షం వీరదాసు వినోద వనవాసం నరేందర్ రెడ్డి బానోత్ సిమ్లా నాయక్ సయ్యద్ మదర్ డీలర్ కొప్పుల రాంరెడ్డి బత్తుల రవికుమార్ సిరి గద్దె ఉపేందర్ గుగ్గిళ్ళ అంబేద్కర్ చీమ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. 





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System