Type Here to Get Search Results !

జిల్లా ప్రభుత్వ కళాశాలల ఉపాధ్యాయుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

NAMASTHE NEWS 0

జిల్లా ప్రభుత్వ కళాశాలల ఉపాధ్యాయుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం. 
సురేందర్ రెడ్డి ప్యానెల్‌కు మద్దతు.



కారంపురి వెంకటేశ్వర్లు నేత.7893556455.

డోర్నకల్/మరిపెడ/జులై 26(నమస్తే న్యూస్).

మరిపెడ,మహబూబాబాద్ తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం మహబూబాబాద్ జిల్లా ఎన్నికలు హనుమకొండలోని స్థానిక కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు.ఈ ఎన్నికలలో సురేందర్ రెడ్డి ప్యానెల్ తరపున కింది వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షులు:జి.వెంకయ్య,మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల యూనిట్ కార్యదర్శి:వి.శాంతికుమార్,తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల యూనిట్ కోశాధికారి:డి.రాజశేఖరం, మహబూబాబాద్ ఎన్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల యూనిట్ ఆగస్టు 2వ తేదీన జరగబోయే రాష్ట్ర ఎన్నికలలో సురేందర్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఏకాభిప్రాయ తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా జర్పుల చిన్న,హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలవ్యవహరించారు పాల్గొన్నవారు. మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల యూనిట్ నుండి వి.సాంబశివరావు కార్యదర్శి,ఎ.అన్నపూర్ణ అధ్యక్షులు  తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల యూనిట్ నుండి వై.రవీంద్రారెడ్డి అధ్యక్షులు,డి.పార్వతి కార్యదర్శి  మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల యూనిట్ నుండి కె.నరసింహారావు అధ్యక్షులు,జి.సురేందర్ రెడ్డి కార్యదర్శి  గార్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల యూనిట్ నుండి కె.రామ్మోహనరావు అధ్యక్షులు గా నియమితులయ్యారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System