తెలంగాణ ఉద్యమ కారులు క్రమంగా మరుగున పడిపోయారు.
రిపోర్టర్, పిల్లలు నరసింహారావు
సెంటర్, బయ్యారం
బయ్యారం,జూలై 27(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ పిలుపుమేరకు ఈరోజు బయ్యారం మండలం ఉద్యమకారుల అధ్యక్షులు అడిదేలా వీరబద్రం అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా మహబూబాబాద్ జిల్లా ఉద్యమకారుల ఫోరమ్ ప్రధానకార్యదర్శి నాయిని శ్రీనివాస్ రెడ్డి హాజరు కావడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కారుల అంశాన్ని ప్రభుత్వ అజెండాగా మార్చిన తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం తొమ్మిది సంవత్సరాల నిరంతర పోరాటానికి ఫలితమే గుర్తింపు కమిటీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వేలాది మంది తెలంగాణ ఉద్యమ కారులు రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు, ఉద్యమ నాయకత్వానికి కూడా క్రమంగా మరుగున పడిపోయారు. ఉద్యమ కారుల సంక్షేమం, ఆత్మగౌరవం గురించి మాట్లాడే వేదికలు కూడా కనిపించని పరిస్థితుల్లో, 9సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం స్థాపించబడింది.
"తెలంగాణ ఉద్యమ కారుల ఆత్మగౌరవం – సంక్షేమం" అనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ ఉద్యమం నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కారుల గొంతుకగా నిలిచింది. తెలంగాణ ఉద్యమ కారులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే ఏకైక డిమాండ్‌తో ఫోరం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో విస్తృత పర్యటనలు నిర్వహించింది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో ఉద్యమ కారులకు అమలవుతున్న సంక్షేమ పథకాలను అధ్యయనం చేసి, తెలంగాణలో కూడా అలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు, ఘన సన్మానాలు, సంతకాల సేకరణ, ప్రజాప్రతినిధులకు లేఖలు, రాజకీయ పార్టీలకు వినతిపత్రాలు, ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు, బస్ యాత్రలు, పాదయాత్రలు, మండల యాత్రలు, చలో గన్‌పార్క్ వంటి అనేక ప్రజా ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించింది.
ఈ నిరంతర పోరాటం ఫలితంగానే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమ కారుల సమస్యలు రాష్ట్ర రాజకీయ అజెండాగా మారాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమ కారుల సంక్షేమ అంశాలు చోటు చేసుకోవడంలో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం కీలక పాత్ర పోషించింది. అలాగే తెలంగాణ ఉద్యమ కారుల డిక్లరేషన్ విడుదల చేసి, ఉద్యమ కారుల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విశేష కృషి చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్లో వేలాది మంది ఉద్యమ కారులతో మహాసదస్సు నిర్వహించి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఆ సందర్భంగా ఉద్యమ కారుల గుర్తింపు కమిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఆ హామీ అమలు కోసం తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఇతర ప్రజాప్రతినిధులకు పలు మార్లు వినతిపత్రాలు సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు, సమీక్ష సమావేశాలు, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరంతరం ఒత్తిడి తీసుకురావడంతో ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కారుల గుర్తింపు కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం గుర్తింపు కమిటీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో, కాలయాపన చేయకుండా తెలంగాణ ఉద్యమ కారుల గుర్తింపు ప్రక్రియను వెంటనే ప్రారంభించి, ఎన్నికల హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బయ్యారం మండలం ఉద్యమకారుల ఫోరమ్ మండల అధ్యక్షులు అడిదెల వీరబద్రం, ప్రధానకార్యదర్శి, గుండాగాని రామానాదం,, నాయిని శ్రీనివాస్, జిల్లా ప్రధానకార్యదర్శి నాయిని శ్రీనివాస్ రెడ్డి,సహాయకార్యదర్శి వన్నం రామారావు, గుండాల శ్రీనివాస్, భీమనపల్లి యాదగిరి,జెతూ, బాబూలాల్, రెంటాల ఉపేంద్ర,, నెమలికల్ల ఉపేంద్ర,తాటి జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

