రైతు వేదికలో విత్తన మేళా ...రైతులు సద్వినియోగించుకోవాలి.
రిపోర్టర్: పిల్లల నరసింహారావు
బయ్యారం, జూలై27(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా మండలంలోని కొత్తపేట గ్రామపంచాయతీలో నీ రైతు వేదికలో నేడు విత్తన మేళా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రైతులు, విత్తన డీలర్లు పాల్గొన్నారు.ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం మరియు కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు పెసర, కంది, మినుము వంటి ఐడి (ID) పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOలు) పాల్గొని రైతులకు అందుబాటులో ఉన్న విత్తనాల వివరాలు తెలియజేశారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ, రైతులు విత్తన మేళాను సందర్శించి తమ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలను సకాలంలో పొందాలని కోరారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా పెసర, మినుము, కంది వంటి ఆరుతడి పంటలను సాగు చేసి ప్రభుత్వ సూచనలను పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు....

