Type Here to Get Search Results !

తిరుమలాయపాలెం మండలంలో వరుస చోరీలు కలకలం

NAMASTHE NEWS 0


పిండిప్రోలు, బీరోలు తర్వాత కాకరవాయిలో మరో భారీ చోరీ.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు.
రూ.1 లక్ష నగదు, 6 తులాల బంగారం అపహరణ.. పోలీసు గస్తీ పెంచాలని గ్రామస్తుల డిమాండ్.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు.
ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.




తిరుమలాయపాలెం, జూలై 27 (నమస్తే న్యూస్ )

తిరుమలాయపాలెం మండలంలో వరుసగా చోటుచేసుకుంటున్న చోరీలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల పిండిప్రోలు, బీరోలు గ్రామాల్లో దొంగతనాలు జరగగా, తాజాగా కాకరవాయి గ్రామంలో మరో భారీ చోరీ వెలుగులోకి రావడంతో గ్రామస్తుల్లో ఆందోళన మరింత పెరిగింది.

కాకరవాయి గ్రామానికి చెందిన బురగోమ్ముల సతీష్ నివాసంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇటీవల కుటుంబంలో కూతురు ఫంక్షన్ నిర్వహించి వచ్చిన కట్నానికి సంబంధించిన నగదు, బంగారాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ చోరీ చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

బాధితుడి వివరాల ప్రకారం, దొంగలు సుమారు 6 తులాల బంగారు తాడుతో పాటు రూ.1 లక్ష నగదు అపహరించినట్లు సమాచారం. ఉదయం ఇంట్లో వస్తువులు చిందరవందరగా కనిపించడంతో చోరీ జరిగిన విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి తిరుమలాయపాలెం ఎస్సైలు కూచిపూడి జగదీష్ కాసర్ల రాజయ్య పోలీసులు చేరుకుని ఆధారాలు సేకరించారు. క్లూస్ టీం సహాయంతో పరిశీలనలు నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడిన దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఇటీవల మండలంలోని పిండిప్రోలు, బీరోలు గ్రామాల్లో జరిగిన చోరీల తర్వాత మరోసారి కాకరవాయిలో దొంగతనం జరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసు గస్తీని మరింత బలోపేతం చేసి, వరుస చోరీలకు పాల్పడుతున్న దుండగులను త్వరితగతిన అరెస్టు చేయాలని గ్రామస్తులు పోలీసు అధికారులను కోరుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System