విద్యార్థులపై పాశవికంగా లాఠీచార్జీకి తెగబడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి.
రిపోర్టర్, పిల్లల నరసింహారావు.
సెంటర్, బయ్యారం.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీ కారణంగా 21 మంది విద్యార్థులు చనిపోయారు వారికి నివాళ్లులర్పిస్తూ మండల కేంద్రoలో అమరవీరుల స్తూపం దగ్గర కొవ్వొత్తులతొ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ కట్టేబోయిన శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడం విద్యార్థుల ఉద్యమం, ప్రజాస్వామ్యం గెలిచింది. నీట్ పేపర్ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పాశవికంగా లాఠీచార్జీకి తెగబడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. నీట్‌ను రద్దు చేసి ఆయా రాష్ట్రాలు ప్రవేశపరీక్షలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలి. విద్యావ్యవస్థను పూర్తి ప్రక్షాళన చేయాలి అని అన్నారు.*ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సమితి సభ్యులు కట్టెబోయిన పిచ్చయ్య, భూక్య హరినాయక్, ధరావత్ వీరన్న, లావుడియా భీముడు, బాదం రాజేష్, సంఘీభావంగా జానీ మియా,ధరావత బాబురావు, సెట్ రామ్ తదితరులు పాల్గొన్నారు.

