Type Here to Get Search Results !

మరిపెడ పరిధిలో ఉచిత వైద్య శిబిరాలు.

NAMASTHE NEWS 0

  • మరిపెడ పరిధిలో ఉచిత వైద్య శిబిరాలు.
  • వర్షాకాల వ్యాధులపై అవగాహన.
  • 180 మందికి ఉచిత వైద్యం.


కారంపురి వెంకటేశ్వర్లు నేత.7893556455.

డోర్నకల్/మరిపెడ,జూలై 28(నమస్తే న్యూస్).


మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైధ్యాధికారి గుగులోతు రవి ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిధిలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు.అబ్బాయిపాలెం ఆరోగ్య మందిర్ పరిధిలోని దారావత్ తండా గ్రామ పంచాయతీతో పాటు,మరిపెడ పురపాలక సంఘం పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఈ ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు.

ఈ శిబిరాల్లో జ్వరం,దగ్గు,జలుబు,ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు చేశారు.అదేవిధంగా రక్తపోటు,మధుమేహం,దోమల జ్వరం,డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి బాధితులకు ఉచితంగా మందులను పంపిణి చేశారు.రెండు ప్రాంతాల్లో కలిపి మొత్తం 180 మంది రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు.ఈ సందర్భంగా వైధ్యాధికారి రవి మాట్లాడుతూ..వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు కాలానుగుణ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో దారావత్ తండా సర్పంచ్ దారావత్ తేజ,ఆరోగ్య పర్యవేక్షకుడు ఆచార్యులు,ఆరోగ్య కార్యకర్తలు అనిత,సౌజన్య,శ్రీదేవి,స్వప్న,ఆశా కార్యకర్తలు మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System