ప్రభుత్వ సంక్షేమానికి మరో నిదర్శనం.. 51 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత.
పేదల వైద్యానికి చేయూత.. 51 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.
నర్సింహులపేటలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. 51 కుటుంబాలకు రూ.18.70 లక్షల సహాయం.
నర్సింహులపేట, జూలై 27 (నమస్తే న్యూస్)
డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం, కౌసల్యదేవిపల్లి, ముంగిమడుగు, నర్సింహులపేట క్లస్టర్ల పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా 51 మంది లబ్ధిదారులకు రూ.18.70 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకుల సమక్షంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జినుకల రమేష్ మాట్లాడుతూ, పేద ప్రజలకు అత్యవసర వైద్య చికిత్సల సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ప్రత్యేక చొరవతో డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వేగంగా అందుతున్నాయని పేర్కొన్నారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు బొబ్బ సోమిరెడ్డి, దాసురోజు రాజశేఖర్, మండల వెన్నం రవీందర్ రెడ్డి, మండల సమన్వయ కమిటీ చైర్మన్ అలువల శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా నిరంతరం కృషి జరుగుతోందన్నారు.కార్యక్రమంలో సర్పంచ్ పెదమాముల యాకయ్య, సర్పంచ్ పుప్పాల రవీందర్, ఉపసర్పంచ్ కాస యాకయ్య, గ్రామ పార్టీ మంచినీళ్ల రఘు,మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు కడుగుల రామకృష్ణ, మండల సోషల్ మీడియా కన్వీనర్ చిర్ర సతీష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు,గుండాల బిక్షం,ఉపేందర్, మనోహర్ పాషా, తదితరులు పాల్గొన్నారు.


