- చిట్టినోజు బ్రహ్మయ్యకు ఘన నివాళులర్పించిన ఖమ్మం జిల్లా జేఏసీ అధ్యక్షులు మందడి ఇజ్రాయిల్
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, జూలై 28 (నమస్తే న్యూస్)
తిరుమలయపాలెం మండలంలోని తిప్పారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిట్టినోజు బ్రహ్మయ్య సోమవారం మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మందడి ఇజ్రాయిల్ తిప్పారెడ్డిగూడెం చేరుకుని బ్రహ్మయ్య పార్ధీవదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుంభం ఉపేందర్, ఉపసర్పంచ్ పూసులూరి రమేష్, మాజీ సర్పంచ్ సంగు లక్షమయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు పిడమర్తి రాజేష్, వేల్పుల నవీన్, వేల్పుల వీరన్న, బండి రామారావు, వి.ఓ. మండల అధ్యక్షురాలు వేల్పుల సుశీల, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని బ్రహ్మయ్యకు నివాళులర్పించారు.

