గీతన్నల చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ.
చిన్నగూడూరు,ఆగస్టు 01(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామంలో గీతన్నల చైతన్య యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గునిగంటి కమలాకర్ గౌడ్, గ్రామ కుల పెద్దలు గునిగంటి వెంకన్న, గునిగంటి కృష్ణతో, ముతయ్య, గునిగంటి కృష్ణ, శ్రీను, సుధాకర్, సురేష్ అశోక్ పాటు గ్రామ కుల సభ్యులు పాల్గొన్నారు. చైతన్య యాత్రను విజయవంతం చేయాలని వారు గ్రామ గౌడన్నలను విజ్ఞప్తి చేశారు.

