Type Here to Get Search Results !

6, 7, 8 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

NAMASTHE NEWS 0

జనంపల్లి బాలికల గురుకుల పాఠశాలలో 6, 7, 8 తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.



రామన్నపేట,జూలై 31(నమస్తే న్యూస్)

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 6వ, 7వ, 8వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కె. నాగమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి గల విద్యార్థులు ఆగస్టు 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జనంపల్లి లోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో దరఖాస్తులను సమర్పించాలని ఆమె కోరారు.దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, బోనాఫైడ్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా జత చేయాలని సూచించారు.దరఖాస్తు చేసిన విద్యార్థులకు ఆగస్టు 5వ తేదీ (బుధవారం) ఉదయం 10 గంటలకు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాల ప్రాంగణంలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.అర్హత కలిగిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కె. నాగమ్మ విజ్ఞప్తి చేశారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System