Type Here to Get Search Results !

ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా బిఎల్ఎ ల సమావేశం.

NAMASTHE NEWS 0

ఎస్ ఐ ఆర్   ప్రక్రియలో భాగంగా బిఎల్ఎ ల సమావేశం.
హాజరైన వివిధ రాజకీయ పార్టీల నాయకులు.




రిపోర్టర్:దామల్ల భాస్కర్ 

తిరుమలాయపాలెం,జూలై 29(నమస్తే న్యూస్ )

ఎస్ ఐ ఆర్ ఓటరు ప్రక్రియలో భాగంగా బి ఎల్ ఓల సూపర్వైజర్ వహీదా (ఆర్ ఐ ) వారి సూచనలతో బుధవారం నాడు జల్లేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో బూత్ నెంబర్ 19, 21 ల బి ఎల్ ఎ ల సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలవారు బి ఎల్ ఏ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ ఓ లు మలుసూరమ్మ, పద్మ,లు జల్లేపల్లి గ్రామంలో గల ఓటర్ లిస్టు నందు మరణించిన వారు, శాశ్వితంగా వలస వెళ్లినవారు, డబుల్ ఓటు ఉన్న వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ లిస్ట్ నుండి తొలగించుట కొరకు  సమావేశంలో చదివి వినిపించారు. చదివిన ఓటర్ లిస్ట్ నందు ఏమైనా పొరపాట్లు ఉన్నచో మా దృష్టికి తెచ్చినట్లయితే వాటిని ఓటరు లిస్ట్ నుండి తొలగించకుండా ఉంటామని వారు వివరించారు. ఓటర్ లిస్ట్ నుండి తొలగించే వివిధ కారణాలతో అవకాశం ఉన్న  రెండు బూతులు కలిపి 82 మంది ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఓటర్లను పరిశీలించిన బిఎల్ఏ లందరూ వాస్తవ పరిశీలన ఉన్నదని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమయం లేనందున ఏన్యుమరేషన్ పారములు సమర్పించని వారు తక్షణమే ఫారంలు అందించే విధంగా బిఎల్ఏ లు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎల్వోలు గాదరి మలుసూరమ్మ, ఇర్రి పద్మ, గ్రామ ఉపసర్పంచ్ రేఖ భద్రకాళి, వివిధ  పార్టీల నాయకులు,పోట్ల జగదీష్,చిప్పరపల్లి రమేష్, పోట్ల నాగేశ్వరరావు(నాగన్న) భాషబోయిన తనయ్ ప్రకాష్,గాదరి బాబు, దడిదల శ్రీలత, టి అశోక్,బి యాకయ్య, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System