Type Here to Get Search Results !

మరిపెడ తండాల్లో ఉచిత వైద్య శిబిరాలు...155 మందికి పరీక్షలు,మందుల పంపిణీ.

NAMASTHE NEWS 0

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించండి. 


ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు గుగులోతు రవి సూచన. 





కారంపురి వెంకటేశ్వర్లు నేత.7893556455.

డోర్నకల్/మరిపెడ,జూలై 27(నమస్తే న్యూస్).

మరిపెడ మండల పరిధిలోని ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా తండాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించినట్లు మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి తెలిపారు.సోమవారం తానంచెర్ల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలోని అజ్మీరా తండా గ్రామపంచాయతీలో మరియు వీరారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలోని దంట్ల కుంట తండా గ్రామపంచాయతీలో డాక్టర్ రవి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు జరిగాయి.ఈ శిబిరాలలో మొత్తం 155 మంది రోగులకు వైద్య పరీక్షలు చేశారు.ముఖ్యంగా రక్తపోటు,మధుమేహం మరియు జ్వరంతో బాధపడుతున్న వారికి తగిన పరీక్షలు నిర్వహించి,ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గుగులోత్ రవి మాట్లాడుతూ,వర్షాకాలం ప్రారంభమైనందున ప్రజలు కాలానుగుణ వ్యాధుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారానే దోమల నివారణ మరియు వ్యాధుల అదుపు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని,కాచి చల్లార్చిన నీటిని తాగాలని ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వామి ఆరోగ్య పర్యవేక్షకులు ఆచార్యులు,బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్త శ్రీమతి ఝాన్సీ,సహాయక నర్సు ప్రసూతి కార్యకర్తలు శ్రీమతి రోజమణి,శ్రీమతి శ్రీలత,ఆశా కార్యకర్తలు,మరియు అంగన్వాడీ ఉపాధ్యాయినిలు పాల్గొని శిబిరాలను విజయవంతం చేశారు...

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System