దొడ్డ కోటిలింగం కు విప్లవ జోహార్లు.
మాస్ లైన్ జిల్లా కార్యదర్శి సివై పుల్లయ్య సంతాపం.
రిపోర్టర్:దామల్ల భాస్కర్
తిరుమలయపాలెం, జూలై 30 (నమస్తే న్యూస్)
చిన్నవయసులోనే గుండెపోటు గురై ఈరోజు ఉదయం మరణించిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేశవపురం గ్రామ నాయకులు దొడ్డ యేసు కుమారుడు దొడ్డ కోటిలింగం మరణించటం సిపిఐ ఎంఎల్ మాస్ లేని ప్రజాపంద పార్టీకి తీరనిలోటని కోటిలింగం మరణం చాలా బాధ కలిగించిందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి సి.వై పుల్లయ్య విచారం వ్యక్తం చేసి కోటిలింగంకు సంతాపం కుటుంబానికి సానుభూతి తెలియజేసి పుల్లయ్య మాట్లాడుతూ యువజన రంగంలో యువత పెడదారి పడుతున్న గ్రామంలో గంజాయి. మద్యం మత్తులో యువత కొట్టక పోవద్దని కోటిలింగం ఆవేదన వ్యక్తం చేసేవాడని పుల్లయ్య అన్నారు. కోటిలింగం మరణ వార్త తెలుసుకున్న సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రతినిధి బృందం తిరుమలాయపాలెం మండలం కేశవపురం గ్రామాన్ని వెళ్లి కోటిలింగం భౌతికకాయంపై మాస్ లైన్ ఎర్రజెండా కప్పి జోహార్లకు అర్పించి కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని పుల్లయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పాలేరు డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య. జిల్లా నాయకులు కమ్మ కోమటి నాగేశ్వరరావు. రేపాకుల శివలింగం. తిమ్మిడి హనుమంతరావు. ఎడ్లపల్లి నవీన్. మాస్ లైన్ మండల కార్యదర్శి సోమనపల్లి వెంకటేశ్వర్లు. బానోత్ శంకర్. గొడుగు విజయ్. దొడ్డ వెంకన్న. మండల వెంకటేశ్వర్లు. పి ఓ డబ్ల్యు పాలే డివిజన్ కార్యదర్శి గోకినపల్లి సరోజిని అక్క.తోకల సీతారాములు. పరికపల్లి నవీన్. మీగడ సత్యం. మీగడ సైదులు. వడ్లమూడి వెంకయ్య. బండి వీరయ్య. పోలే పొంగు ఉప్పలయ్య. శంకర్. తదితరులు.

