Type Here to Get Search Results !

కాల్వ వడ్డు ఎస్సీ ఎస్టీ షాపింగ్ కాంప్లెక్స్ బాధితులకు తగు న్యాయం చేయాలి.

NAMASTHE NEWS 0

కాల్వ వడ్డు ఎస్సీ ఎస్టీ షాపింగ్ కాంప్లెక్స్ బాధితులకు తగు న్యాయం చేయాలి. 
ఎస్సీ కార్పొరేషన్ పరిపాలన అధికారి కి వినతిపత్రం 



రిపోర్టర్:దామల్ల భాస్కర్

తిరుమలాయపాలెం,జూలై 31 (నమస్తే న్యూస్ )

ఖమ్మం  పాత కూరగాయల మార్కెట్ నందు ఎస్సీ కార్పొరేషన్ కు సంబంధించిన షాపుల యజమాలను మా యొక్క షాపులు కేబుల్ బ్రిడ్జి వలన రోడ్డు వెడల్పులో షాపులు తొలగించాలని నోటీసులు ఇవ్వడం జరిగింది తదుపరి నూతన షాపులు నిర్మించి ఇస్తామని నోటీసులు ఇచ్చి తెలియజేశారు.  ఉన్న షాపులను కట్టించి మాకే ఇవ్వగలరు. షాపుల అద్దె బకాయిలు వాయిదా రూపంలో కట్టుటకు అవకాశం ఇవ్వగలరు. మా షాపులు మా కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ప్రత్యామ్నాయం చూసుకొనే అంతవరకు కూల్చివేతలు రెండు నెలలు ఆపగలరు. మా జీవనోపాధి కోల్పోవడం వలన షాపులను కట్టే వరకు నెలకు 15 వేల రూపాయలు ఇప్పించగలరు మా షాపులు వెనకాల గల మున్సిపల్ షెడ్ లలో మా సామానులు  పెట్టుకొనుటకు అవకాశం ఇవ్వగలరని కోరు కుంటున్నాం. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ పరిపాలన అధికారి ఉమా కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారి మాట్లాడుతూ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గుంతెటి వీరభద్రయ్య , దేవ పొంగు సుదర్శన్, తగరం అశోక్, కొలిక పొంగు వెంకట నారాయణ, మునగాల ఉపేందర్, చెరుకుపల్లి నాగేశ్వరరావు, ఆంజనేయులు, అచ్చని జయమ్మ, ఇనుప దుర్గా, కే కమల తదితరులు ఖమ్మం జాయింట్ కలెక్టర్ ను కలిసి ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ యజమానులు సమస్యను పరిష్కరించాలని వినిత పత్రం అందజేశారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System