గచ్చిబౌలిలోని పట్టణాభివృద్ధి కేంద్రంలో శిక్షణ కార్యక్రమం.
రాష్టంలో నూతనంగా ఎన్నికైన పుర పాలక వర్గాలకు శిక్షణ.
మరిపెడ మున్సిపల్ కేంద్రంనుండి ప్రజాప్రతినిధులు.
ఛైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి నాయకత్వంలో కౌన్సిలర్లు,కోఆప్షన్ సభ్యులు.
కారంపురి వెంకటేశ్వర్లు నేత.7893556455.
డోర్నకల్/మరిపెడ,జులై 31(నమస్తే న్యూస్)
పట్టణ పరిపాలనలో కొత్త విధానాలు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అవగాహన పెంచేందుకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని పట్టణాభివృద్ధి శిక్షణ సంస్థ ప్రధాన సభా భవనంలో ఈరోజు శుక్రవారం జాతీయ మరియు రాష్ట్ర పట్టణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో ఉమ్మడి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఈ శిక్షణ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ నుండి మున్సిపల్ ఛైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి నాయకత్వంలో మరిపెడ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు తరలి వెళుతున్నారు.ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ కంచర్ల నరేష్ రెడ్డి పాల్గొననున్నారు.మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డితో పాటు కౌన్సిలర్లు_ఇస్లావత్ తిరుపతి,భద్రమ్మ శ్రీను,పానుగోతు రాములు,మెరుగు రాము,బోడ భాస్కర్,కాంతమ్మ కరణ్ సింగ్,నీలా లచ్చిరాం,బేబీ రవి,గంట్ల గౌతమ్ రెడ్డి,జాటోతు సురేష్,జియో రమేష్ లు ఈ శిక్షణకు హాజరుకానున్నారు.అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు షేక్ సలీమా తాజోద్దీన్,గుండగాని వెంకన్న,షేక్ అజీజ్ లు కూడా పాల్గొననున్నారు.పట్టణ అభివృద్ధి,మౌలిక వసతులు,కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలు,నిధుల వినియోగం వంటి అంశాలపై ఈ శిక్షణ కార్యక్రమంలో నిపుణులు అవగాహన కల్పించనున్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరిపెడ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని ఛైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి,వైస్ చైర్ పర్సన్ కాలం సునిత రవింధర్ రెడ్డి తెలిపారు.

