అబ్బాయిపాలెంలో మృతురాలికి సిఐటియు నేతల నివాళి.
కారంపురి వెంకటేశ్వర్లు నేత.7893556455.
డోర్నకల్/మరిపెడ/జులై 26(నమస్తే న్యూస్.)
కొండ ఉప్పలమ్మకు ఘన నివాళి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన సిఐటియు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం మాజీ అధ్యక్షులు కొండ ఉప్పలయ్య సతీమణి కొండ ఉప్పలమ్మ(52)అకాల మరణం పొందడం బాధాకరమని సిఐటియు నేతలు తెలిపారు.ఆదివారం ఉప్పలమ్మ గారి పార్దేహికాన్ని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్,రాష్ట్ర కార్యదర్శులు వంగూరు రాములు,జె.వెంకటేష్ సందర్శించి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉప్పలమ్మ మరణం సిఐటియు కుటుంబానికి తీరని లోటని,కొండ ఉప్పలయ్య ధైర్యంగా ఉండి కుటుంబ బాగోగులు చూసుకోవాలని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ దుండి వీరన్న,కెవిపిఎస్ జిల్లా నాయకులు జిన్నా లచ్చయ్య,రైతు సంఘం నాయకులు నందిపాటి వెంకన్న,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎర్ర వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

