మూడు రోజులు ఎస్ ఐ ఆర్ ప్రక్రియను సీరియస్ గా నమోదు చేయాలి.
బయ్యారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సీతారాం రెడ్డి.
రిపోర్టర్, పిల్లల నరసింహారావు
సెంటర్, బయ్యారం
బయ్యారం,జూలై 29(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సీతారాం రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ BLA తెలియజేయునది ఏమనగా ఈ 3 రోజులు తప్పకుండా SIR ఓటు నమోదు కార్యక్రమం సీరియస్ గా చేయాలని ఇల్లందు ఎమ్మెల్యే శాసనసభ్యులు కోరం కనకయ్య ,మహబూబాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు డా. ఉమా మురళి ఆదేశానుసారం BLO ల దగ్గర నుండి పూర్తి సమాచారం తీసుకోవడం జరిగిందని ఈ యొక్క సమాచారాన్ని ఆగస్టు 1వ తారీకు తరువాత అసలు పనిచేయని BLA లా పూర్తి సమాచారం మొత్తం MLA కోరం కనకన్న , జిల్లా అధ్యక్షులు డా.ఉమా మురళి రిపోర్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు.కావున ఈ మూడు రోజులు బిఎల్ఎ లు తప్పక వారి వారి బూతులలో ఉన్న అందుబాటులో ఉన్న ఓటర్ల యొక్క ఓటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదేవిధంగా ఇతర గ్రామాలలో,పట్టణాలలో ఉన్న వారి యొక్క సమాచారం తెలుసుకుని వారి యొక్క ఓటు నమోదు కార్యక్రమాన్ని చేయించాలని,చేయించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా మండల అధ్యక్షులు సీతారాం రెడ్డి పెట్టాలని అన్నారు.

