12 వార్డులో మినీ మెడికల్ క్యాంపు...ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
రిపోర్టర్, పిల్లల నరసింహారావు
సెంటర్:బయ్యారం
బయ్యారం, జూలై 29(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని కొత్తపేట గ్రామపంచాయతీలో గవర్నమెంట్ హాస్పటల్ డాక్టర్ ఉస్మాన్ ఆదేశాల ప్రకారం సిబ్బంది ఈరోజు 12 వార్డులో మినీ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. 12వ వార్డు ఇర్ప సాంబశివరావు పాల్గొనడం జరిగింది,సిబ్బంది జ్యోత్స్న మాట్లాడుతూ..వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే వివిధ రోగాల గురించి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది, ఉన్న పరిస్థితులు చాలా మందికి షుగర్లు ,బీపీలు వస్తున్నందున ప్రతి ఒక్కరికి చెకప్ చేయడం జరుగుతుంది అన్నారు, ఇంటి ఆవరణలో శుభ్రంగా ఉంచుకోవాలని, సైడ్ డ్రైనేజీ చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని , పాత డబ్బాలు, తాగి పడేసిన కొబ్బరి బోండాలు, పాత డ్రమ్ములు, వాటిలో నీళ్లు ఉంచరాదని ఉంచటం వల్ల దోమలు వ్యాపించి మలేరియా టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంటాయని అలాంటి ఏమి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, వాటిని బోర్లించి నీటి నిలువ లేకుండా చేసుకోవాలని సూచనలు ఇచ్చారు, ఈ కార్యక్రమంలో 12 వార్డ్ నెంబర్ irpa సాంబశివరావు,సిబ్బంది N, జోష్ణ, సరిత, వెంకటలక్ష్మి, శ్రీవాణి, వార్డు ప్రజలు పాల్గొనడం జరిగింది.


