Type Here to Get Search Results !

విద్యుత్ షాక్ తో గొర్రెపోతు మృతి.

విద్యుత్ షాక్‌తో గొర్రెపోతు మృతి....రూ.19 వేల నష్టం.



నర్సింహులపేట, జూన్ 3 (నమస్తే న్యూస్):మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం గ్యామా తండలో విద్యుత్ షాక్‌కు గురై ఓ గొర్రెపోతు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూక్యా గ్యామా (జాను)కు చెందిన గొర్రెపోతు గ్రామపంచాయతీ పరిధిలోని 11 కేవీ విద్యుత్ లైన్ కింద మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.మృతి చెందిన గొర్రెపోతు విలువ సుమారు రూ.19 వేల వరకు ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. జీవనాధారంగా పశుపోషణపై ఆధారపడిన తనకు ఈ ఘటన తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించిందని పేర్కొన్నాడు.విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని రైతు ఆరోపించాడు.

గ్రామ పరిసరాల్లో ఉన్న విద్యుత్ తీగలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.అధికారులు వెంటనే ఘటనపై విచారణ జరిపి బాధిత రైతుకు తగిన నష్టపరిహారం అందించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా విద్యుత్ లైన్ల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.