అభిమానుల నడుమ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
పండగ వాతావరణంలో పడమటిగూడెం గ్రామం
నర్సింహులపేట, జూన్ 19 (నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జక్కుల ఉప్పలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా సర్పంచ్ జక్కుల ఉప్పలయ్య మాట్లాడుతూ, రాహుల్ గాంధీ దేశ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన, యువత, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగుతోందని తెలిపారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన మరింత కాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నవీన్ రెడ్డి, చిర్ర ఉపేందర్, జక్కి యాకసాయిలు, గువ్వా వెంకన్న, జొన్నగడ్డ యాకన్న, జక్కి మురళి, సురేష్, మండల సోషల్ మీడియా కన్వీనర్ చిర్ర సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

