Type Here to Get Search Results !

లంపి వైరస్ నివారణకు పశువులకు ఉచిత టీకాలు.

లంపి వైరస్ నివారణకు పశువులకు ఉచిత టీకాలు.



నర్సింహులపేట, జూన్ 30 (నమస్తే న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పకిరా తండ గ్రామంలో ఎద్దులకు ముద్ద చర్మవ్యాధి (లంపీ వైరస్) సోకకుండా ఉండేందుకు మంగళవారం ఉచిత టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుగులోతు కైలా రవి నాయక్, పశు వైద్య అధికారి మంజిలాల్ ఆధ్వర్యంలో గ్రామంలోని పశువులకు టీకాలు వేశారు.ఈ సందర్భంగా రైతులకు ముద్ద చర్మవ్యాధి లక్షణాలు, వ్యాధి నివారణ చర్యలు, పశువుల సంరక్షణ, పరిశుభ్రత పాటించడం, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్య అధికారులను సంప్రదించాలని అవగాహన కల్పించారు.వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి పశువుకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కిషన్ నాయక్, పశు వైద్య సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.