Type Here to Get Search Results !

నర్సింహులపేట పరిధిలో భారీ కార్డాన్ సెర్చ్ .

  • గుడుంబాపై పోలీసుల ఉక్కుపాదం.
  • నర్సింహులపేట పరిధిలో భారీ కార్డాన్ సెర్చ్ .
  • పటిక,గుడుంబా తయారీ పై ఆకస్మిక దాడులు.
  • గంజాయి, డ్రగ్స్‌, గుడుంబా పై జిల్లా పోలీస్ బాస్ ప్రత్యేక నజర్‌.
  • వ్యాపారుల నుంచి కొనుగోలుదారుల రోజువారీ జాబితా సేకరణ.
  • తయారీ కేంద్రాల పై సిబ్బందితో ఆకస్మిక దాడులు.
  • నిషేధిత బెల్లం,గుడుంబా అక్రమ తయారీ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఎస్సై భానోత్ వెంకన్న.



నర్సింహులపేట, జూన్ 14 (నమస్తే న్యూస్):

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజామున ప్రత్యేక కార్డాన్ సెర్చ్ నిర్వహించి భారీ మొత్తంలో గుడుంబా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్,ఆధ్వర్యంలో,సీఐ గణేష్ పర్యవేక్షణలో నర్సింహులపేట పోలీసు సిబ్బంది తో గోపతండ,వాస్రం తండ,మూడ్ తండ,జగ్గుతండ,లాలి తండ ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉదయం 5గంటల నుంచి 7గంటల వరకు కొనసాగిన ఈప్రత్యేక తనిఖీల్లో గుడుంబా తయారీకి వినియోగిస్తున్న సుమారు 550 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.అలాగే 32 లీటర్ల నాటు సారాయి (గుడుంబా),50 కిలోల నల్ల బెల్లం,3కిలోల పటిక స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా నర్సింహులపేట ఎస్ఐ బానోతు వెంకన్న మాట్లాడుతూ,అక్రమ మద్యం తయారీ,గంజాయి,డ్రగ్స్‌ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.గుడుంబా తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు కొనసాగుతున్నాయని,నిషేధిత బెల్లం విక్రయాలపై కూడా నిఘా పెంచినట్లు పేర్కొన్నారు.



వ్యాపారుల నుంచి కొనుగోలుదారుల వివరాలను సేకరిస్తూ అక్రమ తయారీ గొలుసును పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.స్వాధీనం చేసుకున్న సామగ్రికి సంబంధించి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలు తమ ప్రాంతాల్లో జరిగే అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎస్ఐ వెంకన్న విజ్ఞప్తి చేశారు. జిల్లాలో నేరాలు, అక్రమ వ్యాపారాల నియంత్రణకు ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.