తీన్మార్ మల్లన్న సీఎం కావాలని గంగాభవాని ఆలయంలో టీఆర్పీ నేతల ప్రత్యేక పూజలు.
బీసీ రాజ్యాధికారమే లక్ష్యం : కొండ వెంకన్న యాదవ్.
దంతాలపల్లి, మే 25 (నమస్తే న్యూస్) : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని తానంచర్ల గ్రామంలో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారి దేవస్థానంలో ఆదివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంతాలపల్లి మండల టీఆర్పీ అధ్యక్షుడు కొండ వెంకన్న యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి మొక్కులు చెల్లించారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే 2029 ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావాలని, పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రిగా ప్రజాసేవ చేసే అవకాశం కలగాలని ప్రత్యేకంగా పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.అనంతరం కొండ వెంకన్న యాదవ్ మాట్లాడుతూ బీసీల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం సాధన కోసం టీఆర్పీ పనిచేస్తోందన్నారు. గ్రామీణ ప్రజల మద్దతు, దేవతల ఆశీస్సులతో భవిష్యత్తులో బీసీలకు రాజకీయాధికారం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పద్మ, భూపాల్, వినయ్ కుమార్, మహేష్, సోమలక్ష్మి, కుటుంబ సభ్యులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


