ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కళ నెరవేరుతుంది.
పేదల మొహంలో చిరునవ్వు చూడటమే మా ప్రజా ప్రభుత్వ ద్వేయం.
ఇచ్చిన మాట నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం.
సూర్యాపేట, జూలై 30 (నమస్తే న్యూస్):
పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు తెలిపారు.బుధవారం సూర్యాపేట పట్టణంలోని 13వ వార్డు బాషా నాయక్ తండాలో బాలెంల విజయలక్ష్మి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు.పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే మా ప్రభుత్వ ధ్యేయం. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి నివేదిత లక్షాది మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యండి అంజద్ అలి, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, 13వ వార్డు కౌన్సిలర్ భూక్య కౌసల్య, భూక్య మహేష్, 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉగ్గం బుచ్చిరాములు, రవి నాయక్, నిరుడు విజయ్, రావుల జానయ్య, రాజు, సతీష్, వేణు,సాయి, రమేష్, అశోక్ శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్ నాయుడు, జిల్లా కాంగ్రెస్ నాయకులు అబ్బాస్, సికందర్, రసూల్ తదితరులు పాల్గొన్నారు.


