గిరిజనులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి.
:మాజీ మంత్రి సత్యవతి రాథోడ్.
రిపోర్టర్: కారంపురి వెంకటేశ్వర్లు (7893556455)
సెంటర్: డోర్నకల్/మరిపెడ.
మరిపెడ ,మే 26(నమస్తే న్యూస్)
లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద జరిగిన చలో హైదరాబాద్ మహా ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు,సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ,ఎన్నికల ముందు గిరిజనుల ఓట్ల కోసం అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ,అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులను పూర్తిగా మోసం చేసిందని ఆరోపించారు.రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని,లగచర్ల నుండి నేటి గిరిజన హామీల వరకు ఇదే పరిస్థితి ఉందన్నారు.జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 12 హామీల గిరిజన డిక్లరేషన్ అమలు చేస్తామని లక్షల మంది సమక్షంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు.గిరిజన ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఇప్పటివరకు అమలు చేయకుండా కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు.
గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంచింది కేసీఆర్ మాత్రమేనని ఆమె అన్నారు.3146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి,మన తండాలో మన రాజ్యమే అనే నినాదానికి న్యాయం చేసింది కేసీఆరే అన్నారు.తెలంగాణలో లంబాడీలు సహా గిరిజనుల ఆత్మగౌరవం,అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని స్పష్టం చేశారు.
గిరిజన రిజర్వేషన్ల పెంపు.
విద్య,ఉద్యోగాల్లో గిరిజనులకు ఉన్న 6% రిజర్వేషన్లను 10%కి పెంచుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకుని అమలు చేశారన్నారు.
ఆదివాసీ,బంజారా భవన్.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కోట్లాది రూపాయల వ్యయంతో సద్భావన బంజారా భవన్ నిర్మించి గిరిజనుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేశారన్నారు.పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో అత్యధిక సంఖ్యలో గురుకుల పాఠశాలలు మంజూరు చేశారని చెప్పారు.పోడు భూములకు పట్టాలు ఇచ్చింది కూడా కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు.కళ్యాణ లక్ష్మి పథకం కూడా లంబాడీలను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చినదేనని అన్నారు.
సేవాలాల్ మహారాజ్ జయంతి.
సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు,బంజారా తండాలను అభివృద్ధి పథంలో నడిపించింది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు.కాంగ్రెస్ పార్టీ యావత్ గిరిజన ప్రజానీకాన్ని మభ్యపెడుతోందని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ గిరిజనుల సహనాన్ని పరీక్షించొద్దు.హక్కుల కోసం మా ఐక్య పోరాటం మరింత ఉధృతం అవుతుంది అని హెచ్చరించారు.గిరిజనులను మోసం చేసిన కాంగ్రెస్‌కు గిరిజనులే త్వరలో తగిన బుద్ధి చెబుతారని అన్నారు.మనకు రావాల్సిన నిధులు,విధులు,హక్కులు నెరవేరేవరకు పోరాటం ఆగదని సత్యవతి రాథోడ్ అన్నారు.

