Type Here to Get Search Results !

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.


నర్సింహులపేట, మే 21 (నమస్తే న్యూస్):

భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జినుకల రమేష్, గ్రామ సర్పంచ్ పెదమాముల యాకయ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానేత ఆశయాలు ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యువత రాజకీయాల్లో ముందుకు రావాలని రాజీవ్ గాంధీ ఆకాంక్షించారని, దేశ భవిష్యత్ కోసం గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్నారు. దేశ అభివృద్ధి, యువత సాధికారత కోసం రాజీవ్ గాంధీ విశేష కృషి చేశారని కొనియాడారు. అలాగే దేశంలో సాంకేతిక రంగ అభివృద్ధికి పునాది వేసిన దూరదృష్టి గల నాయకుడిగా ఆయనను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాసా యాకయ్య, మండల సోషల్ మీడియా ఇంచార్జ్  సతీష్, యూత్ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తుల రమేష్, ఎర్ర రవి, దూరు యాకన్న, సంపత్ రెడ్డి, ఎర్ర నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.