•హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా పోలీస్ శాఖ
•సీసీ కెమెరాల ఏర్పాటు, గంజాయి మరియు డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అవసరం.
-డీఎస్పీ తిరుపతి రావు.
(నమస్తే న్యూస్, మహబూబాబాద్ టౌన్, ఏప్రిల్ 4)
మహబూబాబాద్ టౌన్ మున్సిపల్ పరిధిలో హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీసులు విస్తృత కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా. శభరీష్ పి., ఆదేశాల మేరకు, టౌన్ డీఎస్పీ తిరుపతి రావు ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 14, 22, 26, 29 వార్డుల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారిని గుర్తించి, వారికి హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. “మన వార్డు – మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.
అలాగే వార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, గంజాయి మరియు డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానికులు పోలీస్ శాఖతో కలిసి బాధ్యతగా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టౌన్ డీఎస్పీ తిరుపతి రావు, టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్ఐలు అరుణ్ కుమార్, షాకీర్, వెంకటేశ్వర్లు, సూరయ్యతో పాటు సుమారు 30 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


