పోలీస్ పహారాలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ.
నర్సింహులపేట, ఏప్రిల్ 24(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పోలీస్ పహారాలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు.నాగార్జున భారత్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది గ్యాస్ గ్యాస్ సిలిండర్లు గోదాంకు తెల్లవారుజామున స్టాక్ రావడంతో శుక్రవారం గోడంకు చేరుకున్నారు వినియోగదారులు ఆన్‌లైన్ యాప్‌లో బుకింగ్ కాకపోవడంతో గోదాం కి వచ్చిన గేట్ దగ్గరికి వినియోగదారులు చేరుకుని గ్యాస్ సిలిండర్ల కోసం ఎగబడ్డారు.ముందుగానే బుక్ చేసుకున్నవారికి గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఏజెన్సీ సిబ్బంది చెప్పినా వినియోగదారులు పట్టించుకోలేదు. దాదాపు మూడు గంటల పాటు గ్యాస్ సిలిండర్లు ఎవరికీ ఇవ్వకుండా ఏజెన్సీ సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో నాగార్జున భారత్ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది నర్సింహులపేట పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే ఎస్సై మాలో సురేష్ పోలీస్ సిబ్బంది గ్యాస్ గోదాం కు చేరుకుని వరుస క్రమంలో బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు.

