ఘనంగా విశ్వగురు శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు.
(నమస్తే న్యూస్,మహబూబాబాద్, ఏప్రిల్ 20):
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ గారి అనుమతితో విశ్వగురు శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి (అక్షయ తృతీయ) వేడుకలు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీ మహాత్మా బసవేశ్వర గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, మహాత్మా బసవేశ్వర లింగాయత సాంప్రదాయ స్థాపకుడిగా, సమానత్వం, న్యాయం, భక్తి మార్గాలను ప్రజలకు బోధించిన మహనీయుడిగా చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. ఆయన బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, వసతి గృహ సంక్షేమ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

