- డ్రమ్ సీడ్స్తో తక్కువ ఖర్చు..ఎక్కువ లాభాలు సాధించాలి
- మండల వ్యవసాయ అధికారి గంధం వినయ్ కుమార్
నర్సింహులపేట, జూలై 9 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని వంతడుపుల గ్రామంలో గురువారం మండల వ్యవసాయ అధికారి (AO) గంధం వినయ్ కుమార్ రైతు పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా డ్రమ్ సీడ్స్ పద్ధతిలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు, డ్రమ్ సీడ్స్ విధానాన్ని అనుసరించడం వల్ల సాగు ఖర్చులు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. రైతులు ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా వ్యవసాయం చేయాలని సూచించారు.అనంతరం గ్రామంలోని పత్తి చేనులు, నారుమడులను పరిశీలించిన వ్యవసాయ అధికారి పంటల యాజమాన్యం, ఎరువుల వినియోగం, కలుపు నివారణ, చీడపీడల నియంత్రణ వంటి అంశాలపై రైతులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయ శాఖ అందిస్తున్న సాంకేతిక సూచనలను పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.


