- క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలి.
- ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ భరో ను విజయవంతం చేయాలి.
- వ్య.కా.స జిల్లా ప్రధాన కార్యదర్శి అలవాల వీరయ్య.
- సిఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మెట రాజమౌళి.
కారంపురి వెంకటేశ్వర్లు నేత.7893556455.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 05(నమస్తే న్యూస్).
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,కర్షక,కూలీ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆగస్టు 10న చేపట్టనున్న జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
బుధవారం మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలో మండల స్థాయి ప్రజాసంఘాల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జైల్ భరో కరపత్రాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మెట రాజమౌళి,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలవాల వీరయ్య, రైతు సంఘం నేతలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అలవాల వీరయ్య మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి తెచ్చిన ఈబీఆర్జీఎం చట్టం గ్రామీణ పేదల పని హక్కును కాలరాసిందని విమర్శించారు.పని హక్కును ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పించి,కోటాలు,నిబంధనలు, ఆర్థిక భారాలతో రాష్ట్రాలపై మోపి కోట్లాది గ్రామీణ పేదలను నిరుద్యోగంలోకి నెట్టే కుట్ర జరుగుతోందన్నారు. ఈ ప్రజావ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని,ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి కనీసం 200 రోజుల ఉపాధికి చట్టబద్ధ హామీ,జీవనానికి సరిపడే వేతనం,సమయానికి కూలీ చెల్లింపు,పని అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించే వ్యవస్థను పునరుద్ధరించే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఆహార భద్రతపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మెట రాజమౌళి డిమాండ్ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వత్రికంగా అమలు చేసి ప్రతి కుటుంబానికి తగిన పరిమాణంలో బియ్యం, గోధుమలు, పప్పులు, వంటనూనె, చక్కెర, ఉప్పు తదితర నిత్యావసర వస్తువులను అందించాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:సిఐటియు జిల్లా నాయకులు కుమ్మరికుంట్ల నాగన్న, మల్లన్న, ప్రజా నాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క సైదులు, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జిన్నా లచ్చయ్య,రైతు సంఘం నాయకులు నందిపాటి వెంకన్న,గుండగాని మధుసూదన్,భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరావు,కొండ వెంకన్న,ఎర్ర వెంకన్న,సైదులు,జామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

